నెల్లూరులో బీటెక్ యువతి మృతి

1687చూసినవారు
నెల్లూరులో విషాద ఘటన జరిగింది. నగరంలోని నాలుగో మైలుకు చెందిన హర్షిత(22) బీటెక్ చదువుతోంది. తండ్రితో కలిసి బైక్‌పై మైపాడు గేట్ నుంచి ఇంటికి బయల్దేరింది. కిసాన్ నగర్ వద్దకు రాగానే బైక్ అదుపు తప్పింది. అదే సమయంలో లారీ రావడంతో హర్షిత వాటి చక్రాల కిందపడి అక్కడికక్కడే చనిపోయింది. తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్