నాయుడుపేటలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు

0చూసినవారు
నాయుడుపేటలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు
నాయుడుపేట మండలంలోని జువ్వలపాలెం పంచాయతీ మంద బైలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ మండల కన్వీనర్ తోప్పాని బాలకృష్ణయ్య బాబు జగజీవన్ రావ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జె. మస్తానయ్య, ఎన్. నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్