నెల్లూరు మాగుంట లేఔట్ లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం భీష్మ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పర్వదినం సందర్భంగా విష్ణు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భీష్మ ఏకాదశి అంటేనే విష్ణు సహస్రనామ ఆవిర్భావ దినం. అందుకే భక్తులు సామూహికంగా నామస్మరణ చేస్తూ స్వామివారిని కొలిచారు. తెల్లవారుజాము నుండే ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణ త్యాగం చేసిన ఈ రోజున ఆయనకు తర్పణాలు సమర్పించడం ఆనవాయితీగా సాగింది. దేవాలయాలను మామిడి తోరణాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.