దారుణం.. భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త

87చూసినవారు
దారుణం.. భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త
నెల్లూరు నగరంలో శ్రీహరి అనే వ్యక్తి తన భార్య శ్రీనందినిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఐదేళ్ల క్రితం వివాహం జరిగిన వీరికి తొమ్మిది నెలల కుమార్తె ఉంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన శ్రీహరి, తరచూ గొడవలు పడుతున్నట్లు సమాచారం. ఇటీవల నెల్లూరుకు వచ్చిన శ్రీనందిని ఇంటికి వెళ్తుండగా, భర్త ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం శ్రీహరి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్