నెల్లూరు నగరంలోని దర్గమిట్ట ప్రాంతంలో కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని ఐఎంఏ హాలులో బుధవారం ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల ప్రతిభను వెలికితీసే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సమగ్ర శిక్ష, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డి వెంకట సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.