నెల్లూరులో అంబటి దిష్టిబొమ్మకు శవయాత్ర

150చూసినవారు
నెల్లూరులో అంబటి దిష్టిబొమ్మకు శవయాత్ర
నెల్లూరు నగరంలోని వేదయపాలెం లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఆధ్వర్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు వాడిన అసభ్య పదజాలానికి నిరసనగా ఆదివారం అంబటి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాతంగి కృష్ణ మాట్లాడుతూ అంబటి రాంబాబు, జోగి రమేష్, నాని లాంటి వాళ్ళని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని, చంద్రబాబు నాయుడు పై వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరించారు. డేగ రవి రాఘవేంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కించపరిస్తే సావు డప్పుతో శవయాత్రలు నిర్వహిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్