నెల్లూరులో గాంధీ జయంతి.. యువత విలువలను ఆచరించాలన్న డీవైఎఫ్ఐ

0చూసినవారు
నెల్లూరులో గాంధీ జయంతి.. యువత విలువలను ఆచరించాలన్న డీవైఎఫ్ఐ
నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో శుక్రవారం మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా డీవైఎఫ్ఐ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బీపీ నరసింహ మాట్లాడుతూ, గాంధీ చూపిన సత్యం, అహింస, సామాజిక న్యాయం వంటి విలువలను నేటి యువత ఆచరించాలని అన్నారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాదం, కుల మత విభేదాలు ప్రజాస్వామ్యానికి, సామాజిక ఐక్యతకు ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. గోను చైతన్య, రాజేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్