పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో 169 ఫిర్యాదులు స్వీకరించారు. చట్ట ప్రకారం విచారించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమానాస్పద మృతి, మైనర్ బాలిక అదృశ్యం, వృద్ధుల వేధింపులు, కుటుంబ కలహాలు, ఉద్యోగం పేరుతో మోసం వంటి కేసులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలకు వేగంగా స్పందించి పరిష్కారం చూపాలని ఎస్పీ అధికారులకు స్పష్టం చేశారు.