నెల్లూరులో భారీ వర్షం.. ఇళ్లలోకి డ్రైనేజీ నీరు

530చూసినవారు
నెల్లూరులో భారీ వర్షం.. ఇళ్లలోకి డ్రైనేజీ నీరు
నెల్లూరు నగరంలో గంట పాటు కురిసిన భారీ వర్షం కారణంగా 48వ డివిజన్ పరిధిలోని అనేక ఇళ్లలోకి డ్రైనేజీ నీరు చేరింది. మురుగునీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో స్థానికులు నిత్యావసర వస్తువులు పాడైపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ పూడికతీత పనులు సరిగ్గా చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని, అందుకే నీరు సాఫీగా పోక ఇళ్లలోకి వస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్