జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పరిధిలో మత్స్యకారుల భద్రతను బలోపేతం చేయడానికి, తమిళ జాలర్ల ఆగడాలను అరికట్టేందుకు సముద్ర తీరంలో గస్తీని ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదేశించారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 450 హెచ్‌పి సామర్థ్యం గల హైస్పీడ్ బోటును తక్షణమే కొనుగోలు చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆయన దిశానిర్దేశం చేశారు. నెల్లూరు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.