నెల్లూరు నగర పరిధిలోని ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ లో బార్లు, మద్యం షాపుల యజమానులతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉప కమిషనర్ ఎం శంకరయ్య బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యజమానులు నౌకర్నామ లైసెన్సీలకు తమ వద్ద మద్యం అమ్మకాలు జరిపేటప్పుడు తప్పనిసరిగా 'ఏపీ ఎక్సైజ్ సురక్ష' యాప్ ద్వారా మద్యం బాటిల్లను స్కాన్ చేసి అమ్మకాలు జరపాలని సూచించారు. స్కాన్ చేయకుండా బాటిల్లను విక్రయించడం పూర్తిగా నిషేధించబడిందని స్పష్టం చేశారు.