మనుబోలు సచివాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన జేసీ వెంకటేశ్వర్లు

2చూసినవారు
మనుబోలు సచివాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన జేసీ వెంకటేశ్వర్లు
స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు కార్యక్రమంలో భాగంగా మనుబోలు మండలంలోని 2వ సచివాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న సేవలు, దరఖాస్తుల పరిష్కార విధానం, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమం సక్రమంగా అమలవుతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్