కలువాయి (మండలం) లలితానగర్ సమీపంలో నెల్లూరు వైపు వెళ్తున్న ఆటో అదుపుతప్పి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు వెంటనే స్పందించి, ఆటోలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.