16న కస్తూర్బా లో పెద్ద ఎత్తున విజయోత్సవాలు

325చూసినవారు
16న కస్తూర్బా లో పెద్ద ఎత్తున విజయోత్సవాలు
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈనెల 16వ తారీఖున స్థానిక కస్తూరిబా గార్డెన్స్ లో పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు.
శనివారం శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి రెండు సంవత్సరాల ప్రభుత్వ పాలన ఏర్పాటు పై స్థల పరిశీలనను కస్తూరిబా గార్డెన్స్ లో నిర్వహించారు. పరిశీలన అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని కస్తూరిబా గార్డెన్స్ లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్