మహిళల ఆర్థిక స్వావలంబనే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర న్యాయ, చట్టం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ అన్నారు. ఆదివారం ఉదయం కసుమూరు దర్గా ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, భక్తులకు నిత్యాన్నదాన కేంద్రాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించారు. తొలుత కసుమూరు దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.