నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో 2018లో నమోదైన మహిళ అదృశ్యం కేసులో, ఎనిమిదేళ్ల క్రితం కనుమరుగైన దెవెళ్ల లక్ష్మి (39)ని నెల్లూరు AHTU, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది శనివారం శ్రీకాళహస్తి ఆలయ ప్రాంతంలో సురక్షితంగా గుర్తించారు. ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన బృందాన్ని SP డా. అజిత వేజెండ్ల అభినందించారు.