8 ప్రధాన డ్రైన్ కాలువల ఆధునికీకరణ పనులు వేగవంతం

273చూసినవారు
8 ప్రధాన డ్రైన్ కాలువల ఆధునికీకరణ పనులు వేగవంతం
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని 12 ప్రధాన డ్రైన్ కాలువలలో, 50 కోట్ల రూపాయల వ్యయంతో 8 కాలువల విస్తరణ, పూడికతీత, ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం 42 వ డివిజన్ వాకర్స్ రోడ్డు ధర్మరాజు స్వామి దేవస్థానం సమీపంలోని మన్సూర్ నగర్ ఆర్చ్ పక్కన ఉన్న డ్రైవ్ కాలువలో జరుగుతున్న పూడికతీత పనులను ఆయన పర్యవేక్షించారు. నిర్దేశించిన సమయంలోపు పనులు పూర్తయ్యేలా పర్యవేక్షిస్తామని మేయర్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్