ఘనంగా జాతీయ మాజీ సైనికుల దినోత్సవం

824చూసినవారు
ఘనంగా జాతీయ మాజీ సైనికుల దినోత్సవం
దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టిన వీర జవానుల సేవలను స్మరించుకుంటూ జాతీయ మాజీ సైనికుల దినోత్సవాన్ని బుధవారం నెల్లూరు నగరంలోని తిక్కన ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎన్. విజయకుమార్ 70 ఏళ్లు పైబడిన 30 మంది మాజీ సైనికులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. దేశభక్తి, త్యాగనిరతికి ప్రతీకలైన వీర సైనికుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్