నెల్లూరు జిల్లాలోని రంగనాయకులపేటలో గల శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో బుధవారం పంగున్యుత్తర కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ స్థల పురాణ పఠనం నిర్వహించారు. అనంతరం స్వామి వారి కాశీయాత్ర ఉత్సవం, ఎదురుకోలు ఉత్సవం కనులపండువగా జరిగాయి.