నెల్లూరు: కార్యకర్తలే పార్టీకి జీవం-కాకాణి

448చూసినవారు
నెల్లూరు: కార్యకర్తలే పార్టీకి జీవం-కాకాణి
పొదలకూరు మండల కేంద్రంలోని ఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. మండల స్థాయి సమావేశానికి భారీగా తరలివచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాకాణి కి ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉండి పనిచేసిన ప్రతి నియోజకవర్గంలో అన్నీ వర్గాల వారికి గ్రామ స్థాయి కమిటీలలో అవకాశం కల్పిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్