జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న ఏపీ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో శనివారం 'స్పర్శ్ లేప్రోజీ అవేర్నెస్ కాంపెయిన్' (ఎస్.ఎల్.ఏ.సి) కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 170 మంది బాలికలకు కుష్టు వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి వివరించారు. ముఖ్య అతిథిగా టి.హెచ్. వార్డ్ వైద్యాధికారి శాలిని పాల్గొన్నారు.