జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు ఆమని గార్డెన్స్‌లో ఆదివారం మహిళా, యువజన సదస్సు జరిగింది. దువ్వూరు అరుణమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ పద్మజ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఠపు లలితారాం యాదవ్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో బీసీ సంఘ నేతలు ఐక్యంగా పనిచేసి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉడత శైలజ, విజయమ్మ, పవన్, నందిని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.