నెల్లూరు: లిఫ్ట్ గుంతలో పడి చిన్నారి మృతి

1391చూసినవారు
నెల్లూరు: లిఫ్ట్ గుంతలో పడి చిన్నారి మృతి
నెల్లూరు చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధ్యక్షంవారి వీధిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న వీరమ్మ కుమార్తె మోక్షిత (3) తోటి పిల్లలతో ఆడుకుంటూ అపార్ట్‌మెంట్ నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ గుంతలో అనుమానాస్పద రీతిలో పడిపోయింది. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా, లిఫ్ట్ గుంతలో పాప కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్