నెల్లూరు నగర పాలక సంస్థ ఇన్చార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, శుక్రవారం 45వ డివిజన్ పరిధిలో అధికారులతో కలిసి పర్యటించారు. ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో మరుగుదొడ్ల ఏర్పాటు ఆవశ్యకతను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా వెంటనే మరుగుదొడ్లను నిర్మించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.