నెల్లూరు: బారాషాహిద్ దర్గాను దర్శించుకున్న కలెక్టర్

555చూసినవారు
నెల్లూరు: బారాషాహిద్ దర్గాను దర్శించుకున్న కలెక్టర్
నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల శనివారం తన కుటుంబంతో కలిసి దర్గాను సందర్శించారు. స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద భక్తులతో కలిసి సాంప్రదాయబద్ధంగా రొట్టెను స్వీకరించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రొట్టెల పండుగ మత సామరస్యానికి, భక్తుల ప్రగాఢ విశ్వాసానికి నిదర్శనమని, దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ పండుగకు వస్తారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్