నెల్లూరు జిల్లా సీపీఎం పార్టీ నాయకులు, ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమకారుడు జానావెంకయ్య బుధవారం వయోభారంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలియజేశారు. సీపీఐ రాష్ట్ర సీనియర్ నాయకులు పముజుల దశరథ రామయ్య ఆయనను సందర్శించి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఆలూరు తిరుపాలు, మండల కార్యదర్శి పి. జనార్ధన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.