నెల్లూరు: ధర్మమే గెలిచింది మంత్రి నారాయణ

464చూసినవారు
నెల్లూరు: ధర్మమే గెలిచింది మంత్రి నారాయణ
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరులో మాట్లాడుతూ, అమరావతికి చట్టబద్ధత లభించడంతో ధర్మమే గెలిచిందని, జగన్మోహన్ రెడ్డి ఆడిన మూడు ముక్కలాట ముగిసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్టసభలో అమరావతే రాజధాని అని ఆమోదం పొందినా, వైసీపీ నేతలు అవగాహన లేకుండా అర్ధంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 70,790 ప్లాట్లు కేటాయించామని, కేవలం 650 మందికి మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, డేటా తెలుసుకోకుండా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్