కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు టౌన్ హాల్లో చిన్నారులచే విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ చిన్నారుల నృత్యాలు, పాటలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇతర జిల్లాల నుండి వచ్చిన చిన్నారులు వివిధ దేవతా భంగిమలలో ప్రదర్శనలు ఇచ్చారు. చిన్నారులు పాడిన భక్తి గీతాలు శ్రోతలను ఎంతగానో అలరించాయి.