కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. కొడవలూరు మండలం రేగడిచెలిక గ్రామంలో రూ. 40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రూ. 15 లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ ప్రహారీ గోడ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో కొడవలూరు మండలంలో జరిగిన అభివృద్ధి పనులను ఆమె వివరించారు.