నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్, ఆటో నగర్ లో సోమవారం 75 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీలు, 3 బాక్స్ కల్వర్టుల నిర్మాణ పనులకు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 29వ డివిజన్ అభివృద్ధికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2 కోట్ల 75 లక్షల రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు.