నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాదరాజుగూడూరులో ఆదివారం రూ. 4.90 కోట్ల వ్యయంతో ఆర్&బి రోడ్డు నిర్మాణానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే అంటే ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడని తెలిపారు. గత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడినా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థ పాలనతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు.