నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారిగా ఓ. దినేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంచార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ ను మేయర్ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సన్మానించారు. డాక్టర్ దినేష్ ఆధ్వర్యంలో నెల్లూరు నగర పాలక సంస్థ పబ్లిక్ హెల్త్ విభాగం నగరవ్యాప్తంగా ప్రణాళిక బద్ధంగా పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టాలని మేయర్ ఆకాంక్షించారు.