నెల్లూరు: ఘనంగా మధుసూధన బాబు ఉద్యోగ విరమణ

223చూసినవారు
నెల్లూరు: ఘనంగా మధుసూధన బాబు ఉద్యోగ విరమణ
నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్ ప్రధానోపాధ్యాయులు సింగరాజు మధుసూధన బాబు ఉద్యోగ విరమణ మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది ఉపాధ్యాయులు పాల్గొని, ఆయన శేష జీవితం అహ్లాదకరంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 'మధుసూధన శతకం' పుస్తకావిష్కరణ కూడా జరిగింది. వాటర్ ఇన్ లాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జెడ్ శివప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, కార్పొరేటర్ మొగళ్ళ పల్లి కామాక్షి దేవి, పలువురు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్