నెల్లూరు: అబ్దుల్ కలాం పార్కును ప్రారంభించిన నారాయణ

1086చూసినవారు
నెల్లూరు: అబ్దుల్ కలాం పార్కును ప్రారంభించిన నారాయణ
నెల్లూరు 48వ డివిజన్‌లో రూ. 40 లక్షల వ్యయంతో ఆధునీకరించిన ఏపీజే అబ్దుల్ కలాం పార్కును రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం ఘనంగా ప్రారంభించారు. మంత్రికి స్థానికులు, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రి లాంఛనంగా పార్కును ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్