నెల్లూరు: వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

382చూసినవారు
నెల్లూరు: వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
గత వారం రోజులుగా జిల్లాలో వీస్తున్న వడగాల్పుల వల్ల ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని బీఎంపీ అసోసియేషన్ జిల్లా ప్రచార కార్యదర్శి షేక్ గౌస్ లాజమ్ తెలిపారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు మెడికవర్ ప్రైవేట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఆర్టీసి బస్టాండ్ వద్ద గల ఏనుగు పట్టాభిరామిరెడ్డి కల్యాణ మండపంలో సుమారు 150 మంది గ్రామీణ వైద్యులకు 'వడదెబ్బ - ప్రధమ చికిత్స' అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ మండలాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్