నెల్లూరు రూరల్: నివాళులర్పించిన కోటంరెడ్డి

452చూసినవారు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పొట్టెపాలెం గ్రామ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులురెడ్డి బుధవారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ వార్త విని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పొట్టే పాలెం లోని ఆయన నివాసానికి వెళ్లి శ్రీనివాసులు రెడ్డి భౌతికకాయానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్