నెల్లూరు నగరంలోని హరిణి హోటల్ అధినేత సిపి, పెంచలయ్య ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచనలకు అనుగుణంగా, స్థానిక బివి నగర్ లోని వాత్సల్య విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, ఇతర విద్యాసామగ్రి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్యాటరింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వినయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రాజు, రంజిత్, అంకయ్య తదితరులు పాల్గొన్నారు.