నెల్లూరు: చిన్నారిపై లైంగిక దాడి

286చూసినవారు
నెల్లూరు: చిన్నారిపై లైంగిక దాడి
నెల్లూరులోని సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో, అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే తన ఆరేళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కామంతో కళ్లుమూసుకుపోయిన తండ్రి, కుమార్తె అనే విషయాన్ని మరిచి కొంతకాలంగా ఈ ఘోరానికి ఒడిగట్టాడు. ఈ విషయం గమనించిన తల్లి, భర్త పైశాచికత్వంపై ఆగ్రహంతో గురువారం సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్