కులాలకు అతీతంగా, మతసామరస్యాన్ని తెలిపే గొప్ప పుణ్యక్షేత్రం బారా షహీద్ దర్గా అని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పవిత్ర బారా షహీద్ దర్గాని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి దర్శించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. రాష్ట్రం విడిపోయిన నాటి నుండి అభివృద్ధి చెందాలని అల్లాను కోరుకున్నట్లు తెలిపారు. 2014 ముందు రొట్టెల పండగ సందర్భంగా దర్గాను దర్శించిన వారు నాలుగు లక్షలు ఉండేవారని, నేడు 18 లక్షలకు చేరుకున్నారని ఆయన తెలిపారు.