రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో కార్యకర్తలు భాగస్వాములు అయి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో టిడిపి కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టిడిపికి కార్యకర్తలే బ్రాండ్ అని, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేవారే తన వద్ద ఉంటారని తెలిపారు.