అనంతపురంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి జర్నలిస్ట్ క్రికెట్ పోటీల్లో తొలిరోజు ఆదివారం నెల్లూరు జట్టు వెస్ట్ గోదావరి జట్టుపై విజయం సాధించింది. నెల్లూరు జట్టు 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్ట్ గోదావరి జట్టు 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 106 పరుగులు మాత్రమే చేయడంతో నెల్లూరు జట్టు గెలుపొందింది.