నెల్లూరు: జిల్లా జడ్జిని కలిసిన వెంకట సత్య ధనుష

210చూసినవారు
నెల్లూరు: జిల్లా జడ్జిని కలిసిన వెంకట సత్య ధనుష
కావలికి చెందిన దరిశి వెంకట సత్య ధనుష, ఇటీవల జూనియర్ సివిల్ న్యాయాధికారిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె గురువారం నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన కార్యాలయంలో గౌరవ జిల్లా జడ్జి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ, న్యాయ రంగం పట్ల నేటి యువత ఆసక్తి చూపడం అభినందనీయమని అన్నారు. సత్య ధనుష గౌరవ జిల్లా జడ్జిని పుష్పగుచ్ఛంతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్