నెల్లూరు: ఆన్‌లైన్‌లో మహిళ పరిచయం.. రూ.30 లక్షలు స్వాహా!

668చూసినవారు
నెల్లూరు: ఆన్‌లైన్‌లో మహిళ పరిచయం.. రూ.30 లక్షలు స్వాహా!
నెల్లూరు వెంకటరెడ్డి నగర్‌కు చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగి వాట్సాప్, టెలిగ్రామ్‌లో శివాని అనే మహిళ పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, ఆ మహిళ సూచించిన బ్యాంక్ ఖాతాలకు బాధితుడు రూ.29.8 లక్షలు జమచేశాడు. తన అవసరానికి డబ్బు ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించగా, డబ్బు రాకపోవడంతో బాధితుడు వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఆన్‌లైన్ మోసాలపై ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్