నెల్లూరు రొట్టెల పండగలో విధులు నిర్వహిస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడు శనివారం స్పృహ తప్పి పక్కనే ఉన్న గోతిలో పడిపోయాడు. దర్గా కమిటీ సభ్యులు, స్థానికులు అతడిని బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. స్పృహ రాకపోవడంతో దర్గా వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి తరలించి చికిత్స అందించారు.