ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి సోమవారం నెల్లూరు గ్రామీణం, నెల్లూరు సిటీ పరిధిలోని పలు మండలాల్లో ఆకస్మికంగా పర్యటించారు. హాస్టళ్లు, వంటశాలలు, ఆహార నిల్వ గదులను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ఆయన, పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఆహార విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.