నెల్లూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎన్ఆర్ హెచ్ ఎం విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి తెలిపారు. ఒక సైకియాట్రిస్ట్, ఇద్దరు నర్సులు, ఇద్దరు వార్డు బాయ్స్, ముగ్గురు కౌన్సిలర్లు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను ఒక సంవత్సర కాలపరిమితితో భర్తీ చేస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 9వ తేదీలోపు సర్వజన ఆస్పత్రిలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.