నులు: బొజ్జ తారకం 87వ జయంతి వేడుకలు

500చూసినవారు
నులు: బొజ్జ తారకం 87వ జయంతి వేడుకలు
నెల్లూరులోని గాంధీ బొమ్మ ఆర్ పి ఐ పార్టీ జిల్లా కార్యాలయంలో బొజ్జ తారకం 87వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎస్ కే మాబు మాట్లాడుతూ, బొజ్జ తారకం కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయన బడుగు బలహీన వర్గాల, బహుజనుల శక్తి అని కొనియాడారు. బహుజనుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన యోధుడిగా, బలహీన వర్గాల కోసం న్యాయవాదిగా న్యాయస్థానాల్లో న్యాయం కోసం పాటుపడిన వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్