నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద శనివారం రొట్టెల పండుగ సందర్భంగా, విధుల్లో ఉన్న నెల్లూరు రూరల్ తహశీల్దార్ సుధీర్ కారును సీఐ రమేష్ బాబు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కారును లోపలికి అనుమతించకపోవడంతో రెవెన్యూ సిబ్బంది ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న నెల్లూరు ఆర్డీవో అనూష ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను సర్దిచెప్పారు. అనంతరం సీఐ, తహశీల్దార్లకు క్షమాపణ చెప్పడంతో వివాదం సర్దుమణిగింది.