నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ. నందన్ ఆదేశాల మేరకు, స్థానిక పెద్ద బజారులోని కే. జీ. ఎన్. డీలక్స్ అపార్ట్‌మెంట్ 8 సంవత్సరాలుగా రూ. 4 లక్షల కొళాయి పన్ను బకాయి పడటంతో, శనివారం తాగునీటి కొళాయి కనెక్షన్‌ను తొలగించారు. అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన డ్రైనేజీ కనెక్షన్‌ను కూడా బ్లాక్ చేశారు. ఈ చర్యలో నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కార్తీక్, అడ్మిన్ కార్యదర్శి ప్రసాద్, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.