రౌడీ షీటర్‌పై పీడీ యాక్ట్ నమోదు

1చూసినవారు
రౌడీ షీటర్‌పై పీడీ యాక్ట్ నమోదు
తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల భద్రతకు ముప్పుగా మారిన రౌడీ షీటర్ జి. శ్రీనివాసులు అలియాస్ శ్రీనుపై తిరుపతి జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. నిరంతరం నేరాలకు పాల్పడుతున్న అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు ఆదివారం తరలించారు. ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ప్రతిపాదన మేరకు, కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దాడులు, దొంగతనాలు, మహిళలపై వేధింపులకు పాల్పడుతూ సమాజానికి హాని కలిగిస్తున్న ఇలాంటి వ్యక్తులను ఉపేక్షించేది లేదని, భక్తుల రక్షణే తమ ధ్యేయమని పోలీసులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్